Abn logo
May 6 2021 @ 12:29PM

మహిళా వాలంటీర్‌‌కు వీఆర్వోల వేధింపులు

కర్నూలు : జిల్లాలోని కోయిలకుంట్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా వాలంటీర్‌ను ఇద్దరు వీఆర్వోలు వేధింపులకు గురిచేశారు. ఇంటి స్థలం మంజూరు విషయంలో తనను వీఆర్వోలు వేధిస్తున్నారని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ వాలంటీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. వీఆర్వోలపై పోలీసులు కేసు నమోదు కాకుండా స్థానిక నేతలు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement