వీఆర్వోల నిరసనలు

ABN , First Publish Date - 2021-12-03T05:39:27+05:30 IST

సచివాలయాల్లోకి విలే జ్‌ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వో)ను రానివ్వద్దని మంత్రి డాక్టర్‌ ఎస్‌.అప్పలరాజు అవమానించడంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తాయి.

వీఆర్వోల నిరసనలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2 : సచివాలయాల్లోకి విలే జ్‌ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వో)ను రానివ్వద్దని మంత్రి డాక్టర్‌ ఎస్‌.అప్పలరాజు అవమానించడంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తాయి. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్‌.విద్యాసాగర్‌ ఏలూరులో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు రుణ విముక్తి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వీఆర్వోలు ఒక్కో గృహానికి నాలుగైదుసార్లు తిరిగినప్పటికీ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణ మొత్తాన్ని చెల్లించలేకపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న శ్రీకాకుళం జిల్లా పలాసలో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌, మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై అభ్యం తరకరంగా మాట్లాడాన్ని తప్పు పట్టారు. దీనిపై మంత్రి క్షమాపణలు చెప్పాలని, కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-03T05:39:27+05:30 IST