రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం

ABN , First Publish Date - 2021-02-24T05:30:00+05:30 IST

రేషన్‌ సరుకులను పంపిణీ చేసుకొని ఇంటికి వెళ్తున్న ఓ వీఆర్వోను లారీ రూపంలో మృత్యువు కబళించింది. చిలకపా లెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎచ్చెర్ల పోలీసుల వివరాల ప్రకారం... లావేరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బలివాడ ధనుం జయరావు(52) ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)గా పని చేస్తు న్నారు.

రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 24: రేషన్‌ సరుకులను పంపిణీ చేసుకొని ఇంటికి వెళ్తున్న ఓ వీఆర్వోను లారీ రూపంలో మృత్యువు కబళించింది. చిలకపా లెం  వద్ద  ఈ ఘటన చోటు చేసుకుంది. ఎచ్చెర్ల పోలీసుల వివరాల ప్రకారం... లావేరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బలివాడ ధనుం జయరావు(52) ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)గా పని చేస్తు న్నారు. బుధవారం ఉదయం మొబైల్‌ వాహన ఆపరేటర్‌తో కలసి ధనుంజయరావు తోటపాలెం లో రేషన్‌ సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామం లక్ష్మీపురం వెళ్తుం డగా, చిలకపాలెం సమీపంలోని ఫ్లైఓవర్‌ వద్ద వెనుక నుంచి లారీ ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. ధనుంజయరావుకు భార్య శైలజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తుండగా,  పిల్లలు బీటెక్‌ చదువుతున్నారు. వీఆర్వో మృతి విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సనపల సుధాసాగర్‌, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  ధనుంజయరావు మృతితో  లక్ష్మీపురం, తోటపా లెంలలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై ఎచ్చెర్ల పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 ప్రమాదాలకు నిలయంగా చిలకపాలెం

చిలకపాలెం పాత టోల్‌ గేట్‌ ప్రాంతం ప్రమాదాలకు నిల యంగా మారుతోంది. నిత్యం ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఈ ప్రాంతంలో పంచాయతీ వార్డు మెంబరుగా పోటీచేసిన ఎచ్చెర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లారీ ఢీ కొని మృతి చెందాడు. దీన్ని మరువక ముందే వీఆర్వో దుర్మరణం చెందడం భయాందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చిలకపాలెం  పాతటోల్‌ గేట్‌ సమీపంలోని చెరు వు వద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఈ వంతెన కింద నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ చాలా వంపుగా రహదా రిని ఏర్పాటు చేయడంతో వేగంగా వచ్చే వాహ నదారులు ప్రమాదానికి గురవుతున్నారు. ప్రమా దాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉంది.  

Updated Date - 2021-02-24T05:30:00+05:30 IST