మధుర ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా...దేవాలయానికి సీలు

ABN , First Publish Date - 2020-08-12T17:49:31+05:30 IST

మధుర నగరంలోని ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు దేవాలయాన్ని మూసివేశారు.....

మధుర ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా...దేవాలయానికి సీలు

మధుర (ఉత్తరప్రదేశ్): మధుర నగరంలోని ఇస్కాన్ దేవాలయంలో 22 మందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు దేవాలయాన్ని మూసివేశారు. పశ్చిమబెంగాల్ లో జరిగిన ప్రధాన పూజారి అంత్యక్రియల్లో మధుర ఇస్కాన్ దేవాలయానికి చెందిన 10 మంది పాల్గొన్నారు. దీంతో ముందుగా ఆలయంలో ఇద్దరు పూజారులకు కరోనా సోకింది. దీంతో ఇస్కాన్ దేవాలయ ఆవరణలో నివాసముంటున్న 330 మందికి పరీక్షలు చేయగా వారిలో 22 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని మధుర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూదేవ్ సింగ్  చెప్పారు. ఇస్కాన్ దేవాలయంలో ముగ్గురు పూజారులు, నలుగురు బ్రహ్మచారులు, ఇద్దరు సంకీర్తన సభ్యులు, ఐదుగురు ఆలయ పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో కరోనా బాధితులను హోం ఐసోలేషన్ కు తరలించారు.

Updated Date - 2020-08-12T17:49:31+05:30 IST