డిఏల రికవరీ పేరుతో వేధింపులు

ABN , First Publish Date - 2022-06-23T03:55:50+05:30 IST

చాలీచాలని జీతాలతో బతుకుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏలు) డీఏల రికవరీ పేరుతో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మర్రి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

డిఏల రికవరీ పేరుతో  వేధింపులు
మాట్లాడుతున్న వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

సీఎంకు చెప్పినా అందని జీతాలు

వీఆర్‌ఏల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

కావలి, జూన్‌ 22: చాలీచాలని జీతాలతో బతుకుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏలు) డీఏల రికవరీ పేరుతో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మర్రి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కావలి జర్నలిస్ట్‌ క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీతాల సమస్యతో పాటు వీఆర్‌ఏల సమస్యలను ఇటీవల కావలికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన న్యాయం చేస్తామని చెప్పినా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న డీఏలు రూ.13,000 తిరిగి చెల్లిస్తేనే జీతాలు వేస్తామంటూ ప్రభుత్వం వీఆర్‌ఏలను వేధిస్తుందన్నారు. డీఏల విధానం ఎంతో కాలంగా కొనసాగుతూ ఒక రూపాయి నుంచి రూ.300 వరకు పెరిగిందన్నారు. జగన్‌ ప్రభుత్తం గత ప్రభుత్వం పెంచిన డిఏను వెనుకకు ఇవ్వమని ఒత్తిడి చేయడం తగదన్నారు. ట్రెజరీ అధికారులు పాత జీవోలే ఉన్నాయని, ఆ ప్రకారం డిఏ వెనుకకు చెల్లిస్తేనే జీతాలు ఇవ్వమని ప్రభుత్వం చెపుతోందని వెల్లడిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే వీఆర్‌ఏల జీతాలు పెంపు, పదోన్నతులు కల్పిస్తామని గతంలో చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా డిఏ రికవరీలు ఆపేసి మూడు నెలల జీతాలు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-06-23T03:55:50+05:30 IST