వీఆర్‌కు తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ

ABN , First Publish Date - 2021-07-25T05:46:51+05:30 IST

తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణను వీఆర్‌కు పంపుతూ పోలీసు అధికారులు ఆదేశాలు జారీచేశారు. తాడేపల్లి ఠాణా ఎదుట గుంటూరుకు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

వీఆర్‌కు తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ

యువతి ఆత్మహత్యాయత్నం ఘటనపై చర్యలు

గుంటూరు, జూలై 24: తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణను వీఆర్‌కు పంపుతూ పోలీసు అధికారులు ఆదేశాలు జారీచేశారు. తాడేపల్లి ఠాణా ఎదుట గుంటూరుకు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ బాలకృష్ణ అరండల్‌పేటలో పనిచేసే సమయంలో ఓ కేసు విషయమై స్టేషనకు వచ్చిన తనతో పరిచయం పెంచుకుని ఆ తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అప్పట్లో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. అయితే ఆ కేసులో తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు మరోసారి నిరసనకు దిగింది. దీనిలోభాగంగా పోలీస్‌స్టేషన ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆయనను శనివారం వీఆర్‌కు పంపుతూ అర్బన ఎస్పీ ఆదేశించారు. 

Updated Date - 2021-07-25T05:46:51+05:30 IST