గోవా, ఉత్తరాఖండ్, యూపీలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-14T13:06:13+05:30 IST

దేశంలోని మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

గోవా, ఉత్తరాఖండ్, యూపీలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలోని మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 301మంది అభ్యర్థుల భవితవ్యాన్ని గోవా ఓటర్లు నిర్ణయించనున్నారు. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.గోవాలో సీఎం ప్రమోద్ సావంత్, ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్, మాజీ సీఎం చుర్చిల్ అలీమావో, మాజీ సీఎం కుమారుడు ఉత్పల్ పారికర్ లు పోటీ చేస్తున్నారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 70 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ ప్రారంభమైంది. 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 81 లక్షలమంది ఓటర్లు నిర్ణయించనున్నారు. 


ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతోపాటు బీజేపీ మంత్రులు, కాంగ్రెస్ మాజీ సీఎం హరీష్ రావత్, ఆప్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో పోలింగ్ కోసం 60వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.జైలులో ఉన్న ఎస్పీ నాయకుడు ఆజంఖాన్ రాంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ కుమారుడు అబ్ధుల్లా ఆజం కూడా స్వార్ సీటు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.

Updated Date - 2022-02-14T13:06:13+05:30 IST