ఓటింగ్‌ యంత్రాల స్వాధీనానికి ట్రంప్‌ లేఖ!

ABN , First Publish Date - 2022-01-23T07:43:13+05:30 IST

అధికార మార్పిడి సజావుగా, ప్రశాంతంగా జరగ డం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇష్టం లేదా? అధికారంలో కొనసాగడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారా? వీటిని ధ్రువీకరించేలా తాజాగా ఓ లేఖ బయటపడింది. ...

ఓటింగ్‌ యంత్రాల స్వాధీనానికి ట్రంప్‌ లేఖ!

వాషింగ్టన్‌, జనవరి 22: అధికార మార్పిడి సజావుగా, ప్రశాంతంగా జరగ డం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇష్టం లేదా? అధికారంలో కొనసాగడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారా? వీటిని ధ్రువీకరించేలా తాజాగా ఓ లేఖ బయటపడింది. ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి ఖరారైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న కేపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న హౌస్‌ కమిటీకి ఈ లేఖ లభ్యమైంది. ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ రక్షణ శాఖ సెక్రటరీకి ఈ లేఖ పంపాలని ట్రంప్‌ భావించారు. లేఖ ముసాయిదాను సిద్ధం చేసుకున్నప్పటికీ.. దాన్ని అఽధికారికంగా జారీ చేయలేకపోయారని తెలిసింది. ఆ లేఖ రక్షణశాఖకు చేరి ఉంటే ఎన్నికల ఫలితాల నిర్ధారణ మరో 2 నెలలు ఆలస్యమయ్యేది. 

Updated Date - 2022-01-23T07:43:13+05:30 IST