యూపీలో 59 స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-23T12:54:18+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం 7 గంటలకు నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది....

యూపీలో 59 స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం 7 గంటలకు నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. యూపీలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 624 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫిలిభిత్, లఖింపూర్ ఖేరి, సీతాపూర్, హర్దోయ్, ఉన్నవ్,లక్నో, రాయ్ బరేలీ, బండ, ఫతేపూర్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. బుధవారం జరుగుతున్న 59 అసెంబ్లీ స్థానాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 51 సీట్లను బీజేపీ గెలుచుకుంది.లఖింపూర్ ఖేరి ఘటన, రైతుల ఆందోళనల నేపథ్యంలో బుధవారం నాటి పోలింగ్ బీజేపీకి అగ్నిపరీక్షగా మారింది. భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు.యూపీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీకి మరోసారి 300 సీట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ప్రయాగరాజ్ నగరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడారు. 


Updated Date - 2022-02-23T12:54:18+05:30 IST