ఫొటోలు మారాయని ఓటు నిరాకరణ

ABN , First Publish Date - 2022-06-24T06:18:25+05:30 IST

మండలంలో గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో తప్పులతడక వల్ల పలువురు ఓటుహక్కు

ఫొటోలు మారాయని ఓటు నిరాకరణ

సంగం, జూన్‌ 23: మండలంలో గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో తప్పులతడక వల్ల పలువురు ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. సంగంకు చెందిన యామల రాణి ఆమె పేరే ఉన్నా ఫొటో మాత్రం మగవారిది ఉంది. ఓటు వేసేందుకు నిరాకరించడంతో వెనుతిరిగింది. మునెయ్య ఓటరు సీరియల్‌ నెంబరు ఎదురు పేరు అతనిదే అయినా ఫొటో మహిళది ముద్రించి ఉంది. దీంతో  ఓటును నిరాకరించడంతో వెనుతిరిగా డు. ఓటర్ల జాబితాలో తప్పులతడకవల్ల పలువురు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-06-24T06:18:25+05:30 IST