వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739

ABN , First Publish Date - 2021-01-16T05:04:45+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739

పురుషులు 3,65,395,  స్త్రీలు 3,72,167,  ఇతరులు 177


వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జనవరి 15: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఓటర్ల సంఖ్య 7,37,739గా నమోధైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన అనంతరం ఈనెల 15న జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ సమావేశంలో డీఆర్వో వాసుచంద్ర, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస రావు(కాంగ్రెస్‌), ఇ.నాగేశ్వర్‌రావు(టీఆర్‌ఎస్‌), బిక్షపతి(సీపీఐ) పాల్గొన్నారు. 

నియోజక వర్గాల వారీగా 

నియోజక వర్గం         ఫురుషులు     స్త్రీలు     ఇతరులు     మొత్తం

వరంగల్‌ పశ్చిమ        131342        132220        12        263574

వరంగల్‌ తూర్పు        113582        118080        156        231818

వర్ధన్నపేట             120471         121867        9        242347

మొత్తం ------------------------------------------

                            365395    372167 177         737739


Updated Date - 2021-01-16T05:04:45+05:30 IST