ఓటర్లు 22.81 లక్షలు

ABN , First Publish Date - 2021-01-16T05:47:26+05:30 IST

జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను శుక్రవారం జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారుల గణాంకాల ప్రకారం 2021 జనవరి 15 తేదీ నాటికి మొత్తం ఓటర్లు 22.81 లక్షలు.

ఓటర్లు 22.81 లక్షలు

2019 ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓటర్లు 76,036

నాడు-నేడు మహిళలదే ఆధిక్యం

కడప, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను శుక్రవారం జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారుల గణాంకాల ప్రకారం 2021 జనవరి 15 తేదీ నాటికి మొత్తం ఓటర్లు 22.81 లక్షలు. అందులో పురుష ఓటర్లు 11,25,284, మహిళా ఓటర్లు 11,55,394 మంది ఉన్నారు. ఽథర్డ్‌ జెండర్‌ 322 మంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 30,110 మంది అధికంగా ఉన్నారు. 


పెరిగిన ఓటర్లు 76,036

2019 ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో జిల్లా మొత్తం 22,04,964 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 10,87,117 ఓటర్లు ఉంటే, మహిళా ఓటర్లు 11,17,547 మంది. థర్డ్‌ జెండర్‌ 300 ఓటర్లు ఉన్నారు. 2021 జనవరి 15న జారీ చేసిన అధికారిక ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 22.81లక్షల ఓటర్లు ఉన్నారు. అంటే 2019 నాటి ఓటర్లతో పోలిస్తే, జిల్లాలో 76,036 మంది ఓటర్లు పెరిగారు. అందులో పురుష ఓటర్లు 38,167, మహిళా ఓటర్లు 37,447, ఽథర్డ్‌ జెండర్లు 22 పెరిగాయి.


జిల్లాలో ఓటర్ల వివరాలు

----------------------------

వివరాలు పురుషులు మహిళలు థర్డ్‌ జెండర్‌ మొత్తం

-----------------------------------------------------------------------------------------

జనరల్‌ 11,22,580 11,55,322 322 22,78,225

సర్వీసు ఓటర్లు 2,704 72 - 2,775

------------------------------------------------------------------------------------------

మొత్తం 11,25,284 11,55,394 322 22,81,000

------------------------------------------------------------------------------------------


నాడు-నేడు పెరిగిన ఓటర్ల వివరాలు

ఓటర్లు 2019 2021 పెరిగిన ఓటర్లు

--------------------------------------------------------------------------------

పురుషులు 10,87,117 10,25,284 38167

మహిళలు 11,17,547 11,55,394 37,847

ఽథర్డ్‌ జెండర్‌ 300 322 22

--------------------------------------------------------------------------------

మొత్తం 22,04,964 22,81,000 76,036

--------------------------------------------------------------------------------


Updated Date - 2021-01-16T05:47:26+05:30 IST