ఓటరు ఎపిక్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌...

ABN , First Publish Date - 2022-01-24T06:40:28+05:30 IST

ఓటరు గుర్తింపు కార్డు విష యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెసులుబాటు కల్పించింది.

ఓటరు ఎపిక్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌...

 ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వెసులుబాటు

- జాతీయ ఓటరు దినోత్సవం నుంచి కొత్త ఓటర్లకు పంపిణీ

జగిత్యాల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఓటరు గుర్తింపు కార్డు విష యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెసులుబాటు కల్పించింది.  ఓట రు గుర్తింపు కార్డు కోసం ఇప్పటివరకు కేవలం మీ సేవ కేంద్రాల ద్వారా నే పొందే అవకాశం ఉండేది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు గొప్ప అవకాశం కల్పించింది. ఇక నుంచి తమ తమ ఓటరు గుర్తింపు కార్డుల్సి మొబైల్‌ ఫోన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.   జిల్లాలో ఈనెల 25వ తేదీ నుంచి ఈ ఎపిక్‌ కార్డులను నూతన ఓటర్లకు అందజేయడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

ఈ ఎపిక్‌ ఓటరు కార్డుల జారీ...

కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్‌ ఐడెంటిటీ కార్డు ఎలకా్ట్రనిక్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఓటరు ఈ ఎపిక్‌ (ఎలకో్ట్రల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు)కార్డుగా పిలుస్తున్నారు. ఈ ఎపిక్‌ కార్డుల సేవల ద్వారా మొబైల్‌ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా సులభంగానే ఓటరు కా ర్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుకల్పిస్తోంది. దీన్ని డిజిటల్‌ లాకర్‌ లో సేవ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. పీడీఎఫ్‌ పార్మెట్‌లో ఫ్రింట్‌ తీసుకోవచ్చును. అంతేకాని ఇందులో ఎలాంటి మార్పులు చేయ డానికి వీలుండదు.

జాతీయ ఓటరు దినోత్సవం నుంచి అమలు...

జాతీయ ఓటరు దినోత్సవమైన జనవరి 25వ తేదీ నుంచి ఈ ఎపిక్‌ కార్డులను పంపిణీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయాత్తం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్లకు అవసరమైన సలహా లు, సూచనలు, ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఇం దుకు అనుగుణంగా ఏర్పాట్లను చేయడంలో అధికారులు మునిగి తేలు తున్నారు. తొలివిడతలో నూతన ఓటర్లకు జారీ చేసిన అనంతరం ఫిబ్ర వరి ఒకటవ తేదీ నుంచి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ అందజేయడానికి కసరత్తులు చేస్తున్నారు. 

జిల్లాలో 6,53,608 మంది ఓటర్లు...

జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓట ర్లు 6,53,608 మంది ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 2,27,366 మం ది.. జగిత్యాల నియోజకవర్గంలో 2,14,228 మంది, ధర్మపురి నియోజక వర్గంలో 2,12,014 మంది ఓటర్లున్నారు. మూడు నియోజకవర్గాల్లో 201 మంది మొత్తం సర్వీసు ఓటర్లున్నారు. జిల్లాలోని ధర్మపురి, కోరుట్ల, జగి త్యాల నియోజకవర్గాల్లో 111 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లున్నారు. ఇందులో 402 మంది పురుషులు, 106 మంది స్త్రీలు, 5 గురు ఇతరులున్నారు.

తొలిసారిగా 2,412 మందికి....

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజ కవర్గాల పరిధిలో 2,412 మంది నూతన ఓటర్లు నమోదు అయ్యారు. వీరికి ఓటరు ఎపిక్‌ కార్డులు అందించే దిశగా అవసరమైన ఏర్పాట్లు చే స్తున్నారు. బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి అందజేయనున్నారు. 

ఓటరు కిట్‌లు సైతం....

ఓటర్లకు ఈ ఎపిక్‌ కార్డులతో పాటు ఓటరు కిట్‌లను సైతం పంపిణీ చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఫొటో ఓటరు గు ర్తింపు కార్డుతో పాటు ఓటర్‌ కిట్‌ కూడా 25వ తేదీలోగా అందజేయ నున్నారు. ఓటరు కిట్‌లో వ్యక్తిగత లేఖ, ఓటరు గైడ్‌, ఓటరు ప్రతిజ్ఞ, ఎపిక్‌ కార్డు కలిగి ఉంటుంది.

జిల్లాలో ఈ ఎపిక్‌ కార్డుల జారీకి సన్నద్దం

- గుగులోతు రవి నాయక్‌, జిల్లా కలెక్టర్‌, జగిత్యాల

జగిత్యాల జిల్లాలో నూతనంగా నమోదయిన ఓటర్లకు తొలివిడతలో ఈ ఎపిక్‌ కార్డులను అందజేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటు న్నాము. జాతీయ ఓటరు దినోత్సవం రోజయిన జనవరి 25వ తేదిన ఈ ఎపిక్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకు అనుగుణంగా సంబందిత అధికారులను సమాయత్తం చేస్తున్నాము.


Updated Date - 2022-01-24T06:40:28+05:30 IST