మొబైల్‌ ఫోన్‌లో ఓటరు కార్డులు

ABN , First Publish Date - 2021-01-24T09:18:59+05:30 IST

ఓటరు గుర్తింపు కార్డుల కోసం ఇకపై మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌ ఫోన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన

మొబైల్‌ ఫోన్‌లో ఓటరు కార్డులు

రేపటి నుంచి ఈ- ఎపిక్‌ సేవలు ప్రారంభం

తొలుత కొత్తగా నమోదైన ఓటర్లకు అవకాశం

1 నుంచి అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..


హైదరాబాద్‌ సిటీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఓటరు గుర్తింపు కార్డుల కోసం ఇకపై మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌ ఫోన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన  ఈ-ఎపిక్‌ కార్యక్రమాన్ని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించనుంది. దీని ద్వారా మొబైల్‌ యాప్‌ లేదా ఓటర్‌ పోర్టళ్ల ద్వారా ఈ సేవలు పొందవచ్చు. పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో వచ్చే గుర్తింపు కార్డును ఎక్కడైనా ప్రింట్‌ తీసుకునే వీలుంటుంది. మొబైల్‌లోనూ డౌన్‌లోడ్‌ చేసుకుని సేవ్‌ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్‌ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘ఈ -ఓటర్‌ హువా డిజిటల్‌.. క్లిక్‌ ఫర్‌ ఎపిక్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25 నుంచి 31వ తేదీ మధ్య రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ ఫోన్‌ల ద్వారా ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసువచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. http://voterportal.eci.gov.in, http://nvsp.in  లోకి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌  వినియోగదారులు http://play.google.com/store/apps/ details.com.ecicitizen , ఐఓఎస్‌ వినియోగదారులు http://apps.apple.com/in/app/voterhelpline/id 1456535004 లింకుల ద్వారా ఎలక్ర్టానిక్‌ ఓటర్‌ గుర్తింపు కార్డులు తీసుకోవచ్చు.

Updated Date - 2021-01-24T09:18:59+05:30 IST