ఓటరు సవరణ జాబితా సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-12-02T06:08:11+05:30 IST

ఓటర్ల సవరణ జాబితా త్వరితగతిన సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు.

ఓటరు సవరణ జాబితా సిద్ధం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

 సిరిసిల్ల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల సవరణ జాబితా త్వరితగతిన సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు. బుధ వారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా ఓటర్ల నమోదు, గరుడ యాప్‌ వినియోగంపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో చనిపో యిన వారి పేర్లను, వారి సంబంధిత బంధు వుల నుంచి ఫారం- 7 ద్వారా తీసుకోవాలని, లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుంచి వా రి పేర్లను తొలగించాలని అన్నారు. డబుల్‌ ఓటర్లను, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిం చాలన్నారు. ఒకే పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్‌ స్టేషన్‌లో ఓటరుగా నమోదై ఉం టే సరి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈవీఎం గోదాములను ప్రతీనెల తనిఖీ చేయాలన్నారు. ఎమ్మె ల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 

 5,094 కొత్త ఓటరు దరఖాస్తులు 

జిల్లాలో ప్రస్తుతం 4 లక్షల 38 వేల 916 మంది ఓటర్లు ఉండగా నవంబరులో ఓటరు నమోదు సవ రణ కార్యక్రమం ద్వారా 5094 మంది కొత్తగా దర ఖాస్తు చేసుకున్నారని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఎన్నికల అధికారికి వివరించారు. ఫారం-6 ద్వారా 2094 దరఖాస్తులు రాగా 893 అమోదిం చామని, 449 తిరస్కరించామని తెలిపారు. ఫారం-7 ద్వారా 2498 దరఖాస్తులు రాగా 146 అమోదించినట్లు, 120 తిరస్కరించినట్లు పేర్కొ న్నారు. ఫారం-8ఏ ద్వారా 64 దరఖాస్తులు రాగా 25 అమోదించి, 15 తిరస్కరించామన్నారు. మిగతా దరఖాస్తులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం

 స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలి పారు. జిల్లాలో 201 మంది ఓటు హక్కును విని యోగించుకోనున్నారని, ఇందులో 121 మంది ఎంపీ టీసీలు, 12 మంది జడ్పీటీసీలు, 66 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉన్నట్లు వివరిం చారు.  సమావేశంలో ఇన్‌చార్జి  డీఆర్వో శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీవో లీల, కలెక్టరేట్‌ ఎన్నికల డీటీ రెహ్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T06:08:11+05:30 IST