ఓటు నమోదును వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసి...

ABN , First Publish Date - 2021-04-08T13:38:08+05:30 IST

తిరుమంగళంలో ఓటు నమోదు ప్రక్రియను వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా తిరుమంగళం సమీ

ఓటు నమోదును వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసి...


పెరంబూర్‌(చెన్నై): తిరుమంగళంలో ఓటు నమోదు ప్రక్రియను వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపం తల్లికుడి పంచాయతీ యూనియన్‌ పరిధిలోని సెన్నంపట్టుకు చెందిన అయ్యనార్‌ (28) మంగళవారం అనుమతి లేకుండా సెల్‌ఫోన్‌ను పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు నమోదును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వ్యవహారంపై కల్లకుడి పోలీసులు విచారించి అయ్యనార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Updated Date - 2021-04-08T13:38:08+05:30 IST