రహస్య ఓటింగ్‌ పెడితే జగన్‌కు వ్యతిరేక ఓటు: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-03-01T01:58:19+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌పై రహస్యంగా ఓటింగ్‌ పెడితే ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు

రహస్య ఓటింగ్‌ పెడితే జగన్‌కు వ్యతిరేక ఓటు: రామకృష్ణ

ఏలూరు:‘ముఖ్యమంత్రి జగన్‌పై రహస్యంగా ఓటింగ్‌ పెడితే ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు’ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జోస్యం చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై మిగతా వర్గాలతోపాటు జగన్‌ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం జరిగిన అమరావతి పరిరక్షణ పేరిట రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిని సీఎం ధ్వంసం చేశారని విమర్శించారు. మొదటి నుంచి అమరావతి విషయంలో ప్రభుత్వం వితండ ధోరణి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. అమరావతి ప్రస్తుతం రాజధానిగా కొనసాగుతుందంటే ఇదంతా అమరావతి జేఏసీ పోరాటమే కారణమన్నారు. ఆఖరికి సీఎం జగన్‌ ఇంటి దగ్గర నుంచి హెలిపాడ్‌కు వెళ్లాలంటేనే 500 మంది పోలీసులను రక్షణగా పెట్టుకుంటున్నారని, కాని సెక్రటేరియేట్‌కు పోవాలంటే దారి పొడవున రెండు వేల మంది పోలీసులను మోహరిస్తున్నారని, మూడు రాజధానుల నిర్ణయం వలనే ఆయన ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-03-01T01:58:19+05:30 IST