మా టీకాతో సైడ్‌ఎఫెక్ట్స్, కానీ.. రష్యా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-09-17T14:11:57+05:30 IST

ప్రపంచంలోనే తొలి కరోనా టీకాగా పేరుగాంచిన రష్యా వ్యాక్సిన్ స్ఫూత్నిక్-వీతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ టీకా తీసుకున్న అనంతరం 14 శాతం మంది వలంటీర్లలో ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు తలెత్తాయిన ఆయన తెలిపారు.

మా టీకాతో సైడ్‌ఎఫెక్ట్స్, కానీ.. రష్యా కీలక ప్రకటన

మాస్కో: ప్రపంచంలోనే తొలి కరోనా టీకాగా పేరు గాంచిన రష్యా వ్యాక్సిన్ స్ఫూత్నిక్-వీతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ టీకా తీసుకున్న అనంతరం 14 శాతం మంది వలంటీర్లలో ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం వంటి  సమస్యలు తలెత్తాయిన ఆయన తెలిపారు.


‘ఇవి మేము ఊహించినవే! ఒకరోజు.. మహా అయితే.. ఒకటిన్నర రోజుల్లో ఈ సమస్యలు మటుమాయమవుతాయి’ అని మంత్రి స్పష్టం చేశారు. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌లో పాలు పంచుకుంటున్న 300 మంది వలంటీర్లలో 14 శాతం మంది తమకు ఈ సమస్యలు ఉన్నట్టు వెల్లడించారు. 


ప్రపంచం వ్యాప్తంగా తుది దశ అయితే ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్ త్వరలో ప్రారంభవుతాయని రష్యా ఇటీవలే ప్రకటించింది. ఇందులో భాగంగా 40 వేల మందికు టీకా ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే గత వారంలో తొలి విడతగా 300 మందికి అధికారులు ఈ టీకాను ఇచ్చారు. త్వరలో వారు రెండో బూస్టర్‌ డోసును కూడా స్వీకరిస్తారు. వలంటీర్లందరూ ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, టీకా తీసుకున్న తరువాత ఏమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తేవాలని రష్యా ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో వారిలో కొందరు తమ ఆనారోగ్య సమస్యలను వెల్లడించారు.



కాగా.. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించకుండానే రష్యా స్ఫూత్నిక్-వీని విడుదల చేయడంతో అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టీకాను పరీక్షించే ప్రక్రియ పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌ ఎలా విడుదల చేస్తారని శాస్త్రవేత్తలు అభ్యంతరం తెలిపారు. అయితే..టీకాకు సంబంధించి తొలి రెండు ట్రయల్స్ ‌ఫలితాలను ప్రచురించిన మెడికల్ జర్నల్ ల్యాన్సెట్.. ఈ టీకా 100 శాతం ప్రభావశీలమైనది ప్రకటించింది.  

Updated Date - 2020-09-17T14:11:57+05:30 IST