Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాలంటీర్ గ్రూపుల్లో మెసెజ్ కలకలం

అమరావతి: ఏపీలోని వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో చర్చిలకు సంబంధించి  ఓ మెసేజ్ కలకలం రేపుతోంది. గ్రామాల్లోని చర్చిల వివరాలు పాస్టర్ల పేర్లు సేకరించాలని సచివాలయ సిబ్బంది నుంచి వాలంటీర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. చర్చిలకు అనుబంధంగా ఉన్న ఆస్తుల వివరాలు ఇవ్వాలని వాట్సప్ మెసేజుల ద్వారా తెలియజేశారు. దీంతో ఇప్పటికే చాలా కార్యక్రమాలతో తమకు పని భారం పెరిగిందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కొత్తగా చర్చిల వివరాలు ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చర్చిల బలోపేతానికి ప్రభుత్వమే కృషి చేస్తుందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement