కొవిడ్‌ భయం

ABN , First Publish Date - 2020-07-02T10:56:40+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ మహమ్మరి వేగంగా విస్తరి స్తోంది. కొన్ని రోజులుగా పలు రకాల సర్వేలను వలంటీర్లు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.

కొవిడ్‌ భయం

రెడ్‌ జోన్‌ ఏరియాల్లో వలంటీర్ల సర్వేలు

తప్పనిసరి పరిస్థితుల్లో విధుల నిర్వహణ

సచివాలయ ఉద్యోగుల్లోనూ ఆందోళన


ఏలూరుసిటీ, జూలై 1: కొవిడ్‌-19 వైరస్‌ మహమ్మరి వేగంగా విస్తరి స్తోంది. కొన్ని రోజులుగా పలు రకాల సర్వేలను వలంటీర్లు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. వలంటీర్లు ప్రతి కుటుంబ సమా చారాన్ని తెలుసు కోవడానికి ఇంటింటికీ వెళ్లాల్సి వస్తోంది. కరోనా వైరస్‌ విజృంభించడంతో వివిధ సర్వేలు నిర్వహిస్తున్న వలంటీర్లకు కరోనా భయం వెంటాడుతోం ది.


సచివాలయ ఉద్యోగుల్లోనూ కొవిడ్‌ అందోళన నెలకొంది. ఇప్పటికే జిల్లా లో కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకోవడానికి ఒక సర్వేను, రేషన్‌ కార్డులకు సంబంధించి ఈకేవైసీ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ రెండు సర్వేలు నిర్వహించడంలో వలంటీర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గ్రామ/వార్డు వలంటీర్లు 20,4,15 మంది ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను నిర్వహిస్తు న్నారు. వీరిలో గ్రామ వలంటీర్లు 16,236 మంది ఉండగా, వార్డు వలం టీర్లు 4,179 మంది ఉన్నారు. వీరితో పాటు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు 8,306 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లలో కొంతమందికి కొవిడ్‌ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించి వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.


దీంతో క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించడం భయంగా ఉందని వలంటీర్లు వాపో తున్నారు. ముఖ్యంగా ఈకేవైసీ సర్వేలో భాగంగా ఆయా రేషన్‌ కార్డుల కుటుంబాల నుంచి వేలిముంద్రలు తీసుకోవాల్సి ఉండడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ఏలూరు పరిసర ప్రాంతాల్లోనూ, రెడ్‌జోన్‌ ఏరియా  పరిధిలో శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకుని, చేతులకు గ్లౌస్‌లు ధరించి, మాస్క్‌లు ధరించి సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదని వలంటీర్లు చెబుతు న్నారు. జిల్లాలో ఈకేవైసీ సర్వే ఇప్పటికే 72శాతం వరకు పూర్తయిందని అధికారుల సమాచారం. ఇక కొవిడ్‌ సర్వే కొనసాగుతోంది.  

Updated Date - 2020-07-02T10:56:40+05:30 IST