పింఛన్‌ పంచని వలంటీరు

ABN , First Publish Date - 2022-07-02T04:52:07+05:30 IST

మండలంలోని నరుకూరు గ్రామానికి చెందిన వలంటీరు ఆకులు సునీల్‌కుమార్‌ పింఛను పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పింఛన్‌ పంచని వలంటీరు

వాడుకున్నాడని లబ్ధిదారుల అనుమానం

తోటపల్లిగూడూరు, జూలై 1 : మండలంలోని నరుకూరు గ్రామానికి చెందిన వలంటీరు ఆకులు సునీల్‌కుమార్‌ పింఛను పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం సచివాలయం సిబ్బంది వలంటీర్లకు నగదును అంద జేశారు. శుక్రవారం మండలంలోని లబ్ధిదారులకు వలంటీర్లు నగదును పంపిణీ చేశారు. కానీ నరుకూరు వలంటీరు పంచలేదు. 35 మందికి సుమారు రూ.87వేలు ఇవ్వాలి. తన ఫోన్‌కి సర్వర్‌ పని చేయడం లేదని సాకు చెప్పి గ్రామంలో కనిపించలేదు.  వలంటీరు ఆ నగదును తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మూడురోజులు ఆలస్యంగా ఇచ్చారని లబ్ధిదారులు చెపుతున్నారు. అధికారులు స్పందించి పింఛన్‌ ఇప్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-07-02T04:52:07+05:30 IST