ద్విచక్రవాహనాల ఢీ : వలంటీర్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-16T06:39:48+05:30 IST

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వలంటీర్‌ దుర్మరణం చెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

ద్విచక్రవాహనాల ఢీ : వలంటీర్‌ దుర్మరణం
రెడ్డిభరత్‌ (ఫైల్‌ఫొటో)





నలుగురు యువకులకు తీవ్ర గాయాలు


కేవీపల్లె, జనవరి 15: చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వలంటీర్‌ దుర్మరణం చెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కలకడ మండలం రాతిగుంటపల్లె పంచాయతీ దిగువబట్టావారిపల్లె హరిజనవాడకు చెందిన సుధాకర్‌ కుమారుడు రెడ్డిభరత్‌(22) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన స్నేహితుడైన పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన రామాంజులుతో కలసి పీలేరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. వీరిని గ్యారంపల్లె బస్టాప్‌ వద్ద కలికిరి మండలం గల్లావారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు భానుప్రకాష్‌ పీలేరు రాజీవ్‌నగర్‌కు చెందిన  చక్రధర్‌, నాగేంద్రతో కలసి వస్తూ ఢీకొన్నాడు. ఈప్రమాదంలో రెడ్డిభరత్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.  ఇతడితో వస్తున్న రామాంజులు మరో వాహనంలోని భాసుప్రకాష్‌, చక్రధర్‌, నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరులోని మార్చురీకి,  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రామ్మోహన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో రెడ్డి భరత్‌ తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో బోరున విలపించారు.

Updated Date - 2021-01-16T06:39:48+05:30 IST