Abn logo
Sep 26 2021 @ 00:26AM

రైతు కుటుంబానికి స్వచ్ఛంద సంస్థ చేయూత

రైతు కుటుంబానికి కాడెడ్లను అందజేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

చండూరు, సెప్టెంబరు 25: నల్లగొడ జిల్లా చండూరు మండలంలోని శేరిగూడెంలో ఇటీవల కావలి యాదయ్యకు చెందిన కాడెడ్లు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలో ఉంటున్న ‘హోప్‌ ఫర్‌ స్పందన’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రూ.80వేలతో రెండు కాడెడ్లను కొనుగోలు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు కావలి యాదయ్య, సత్తమ్మ స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎడ్లను కోల్పోయి రోడ్డున పడుతున్న సమయంలో ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్‌ కో ఆర్డినేటర్‌ అరికెపూడి రఘు, కంచుకట్ల సుభాష్‌, యాదయ్య పటేల్‌, కంకణాల యాదయ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.