కరోనా కట్టడికి స్వచ్ఛంద లాక్‌డౌన

ABN , First Publish Date - 2021-05-09T05:57:00+05:30 IST

రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన చేపడుతున్నారు.

కరోనా కట్టడికి స్వచ్ఛంద లాక్‌డౌన
కనగల్‌లో దుకాణాల మూసివేతతో జనసంచారం లేక బోసిపోయిన రోడ్డు

కనగల్‌ / చందంపేట / వేములపల్లి, మే 8 : రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన చేపడుతున్నారు. కనగల్‌ మండల కేంద్రంలో పాక్షిక లాక్‌డౌన అమలుకు స్థానిక వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8నుంచి 31వరకు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని ఎక్స్‌రోడ్డు వ్యాపారుల సంఘం కమిటీఅధ్యక్షుడు బుర్రి సత్తిరెడ్డి తెలిపారు. ప్రజలులాక్‌డౌనకు సహకరించి కరోనా ని యంత్రణకు సహకరించాలన్నారు. కనగల్‌, తేలకంటిగూడెం తదితర గ్రామాల్లో కరోనా నియంత్రణలో భాగంగా సర్పంచలు పారిశుధ్య సిబ్బందితో కలిసి వీధుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాలు పిచికారీ చేశారు. ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తేలకంటిగూడెం సర్పంచ బోగరి రాంబాబు కోరారు. చందంపేట మ ండల కేంద్రంతో పాటు పోలేపల్లి గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన పాటిస్తున్నట్లు ఆయా గ్రామాల సర్పంచలు, వార్డు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై తీర్మానించారు. ఈ నెల 8నుంచి 31వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు  చందంపేట సర్పంచ గోసుల కవిత అనంతగిరి, పోలేపల్లి సర్పంచ మహేష్‌ తెలిపారు. తీర్మాణ కాపీలను చందంపేట మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఐ సందీ్‌పకుమార్‌కు అందించారు. చందంపేట జడ్పీటీసీ పవిత్రబాయి సైతం ఆయా గ్రామాల సర్పంచలు ఇచ్చిన తీర్మానాలు అమలు చేయాలని ఎస్‌ఐను కోరారు. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌డౌనను పాటించాలని గ్రామ సర్పంచ మజ్జిగపు పద్మ కోరారు. ఈ నెల 8నుండి 20వ తేదీ వరకు గ్రామంలో  ఉదయం 6గంటల నుండి 11గంటల వరకు, సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు.

Updated Date - 2021-05-09T05:57:00+05:30 IST