వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-24T04:50:09+05:30 IST

మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో డివిజనల్‌ లెవల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను శనివారం ప్రారంభిం చారు.

వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న దృశ్యం

దోమకోండ, జనవరి 23: మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో డివిజనల్‌ లెవల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను శనివారం ప్రారంభిం చారు. ఇందులో 19 వాలీబాల్‌ టీంలు వివిధ మండలాల నుంచి వచ్చాయి. ఈ టోర్నమెంట్‌ రెండు రోజుల పాటు కొనసాగనుందని నిర్వా హకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్ర మంలో జడ్పీటీసీ తిరుమలగౌడ్‌, సర్పంచ్‌ నల్ల పు అంజలి శ్రీనివాస్‌, సహకార సంఘం అధ్య క్షుడు నాగరాజ్‌రెడ్డి, ఎంపీటీసీ నిమ్మ శంకర్‌, ఉప సర్పంచ్‌ గజవాడ శ్రీకాంత్‌, వార్డు సభ్యు లు బాలమణి, అశోక్‌, కార్యనిర్వాహకుడు అబ్బ ర బోయిన సిద్ధిరాములు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి క్రాస్‌ కంట్రి పోటీలకు జిల్లా విద్యార్థులు
కామారెడ్డి టౌన్‌, జనవరి 23: కామారెడ్డి జిల్లా అఽథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి క్రాస్‌ కంట్రిసెలక్షన్స్‌ను జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధి స్టేడియంలో నిర్వహించారు. ఇందులో 100మంది వరకు విద్యార్థినీ విద్యార్థు లు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈశ్వర్‌, హరిద యాల్‌ సింగ్‌, ప్రవీణ్‌, సోమేష్‌, బాల్‌సింగ్‌, రాకేష్‌, వినోద్‌కుమా ర్‌, సుమన్‌, తాన్‌సింగ్‌, రాజశేఖర్‌, సురేష్‌, శ్రీను, శ్రావణ్‌కుమా ర్‌, రాజేందర్‌, సరళ, అఖిల, హరిత, సరోజ, సుమిత్ర, శ్రుతిక, సుజాత, సోనియా, రుచితలు రాష్ట్రస్థాయి క్రాస్‌ కంట్రి పోటీల కు ఎంపికైనట్లు అఽథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యద ర్శి అనిల్‌ తెలిపారు. ఈ నెల 31న యాదాద్రి భువనగిరి జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

Updated Date - 2021-01-24T04:50:09+05:30 IST