వాయిస్‌ ట్వీట్‌ చేయండిక!

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

ట్విట్టర్‌ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో టైప్‌ చేయడం ద్వారా మాత్రమే ట్వీట్‌ను పోస్ట్‌ చేస్తున్నాం. ఇకముందు వాయిస్‌ రూపంలో అంటే ఆడియో సందేశాన్ని కూడా ట్వీట్‌ చేయవచ్చు...

వాయిస్‌ ట్వీట్‌ చేయండిక!

ట్విట్టర్‌ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో టైప్‌ చేయడం ద్వారా మాత్రమే ట్వీట్‌ను పోస్ట్‌ చేస్తున్నాం. ఇకముందు వాయిస్‌ రూపంలో అంటే ఆడియో సందేశాన్ని కూడా ట్వీట్‌ చేయవచ్చు. సింగిల్‌ ట్వీట్‌లో 140 సెకన్ల ఆడియోను పోస్టు చేసే వీలుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఫొటోలు, వీడియోలతో పాటు, 280 అక్షరాల వరకు టైప్‌ చేసి ట్వీట్‌ చేసే సదుపాయం ఉంది.


సంభాషణలకు ఇది ఏమాత్రం సరిపోదని భావించిన ట్విట్టర్‌ వాయిస్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా మీ వాయిస్‌ను పోస్టు చేయడం వల్ల మీరు, మీ ఫాలోవర్లు కొత్త అనుభూతి చెందుతారని భావిస్తోంది. ముందుగా ఐఓఎస్‌ వినియోగదారులకు  అందుబాటులోకి తెచ్చేందుకు ట్విట్టర్‌ ప్రయత్నిస్తోంది. ప్రొఫైల్‌ ఫొటో కింద ఉన్న రికార్డు బటన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించి ట్వీట్‌ను రికార్డు చేయవచ్చు. సాధారణ ట్వీట్‌ల మాదిరిగానే మిమ్మల్ని ఫాలో అవుతున్న వారి టైమ్‌లైన్‌లో కూడా వాయిస్‌ ట్వీట్‌లు కనిపిస్తాయి. 

Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST