ట్విట్టర్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌లు

ABN , First Publish Date - 2021-02-20T06:27:14+05:30 IST

మైక్రోబ్లాగింగ్‌ వేదిక ‘ట్విట్టర్‌’ డైరెక్ట్‌ మెసేజ్‌తోపాటు వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌కు భారత్‌లో శ్రీకారం చుడుతోంది. మన దేశం సహా జపాన్‌, బ్రెజిల్‌లో దశలవారీగా ఈ సదుపాయాన్ని ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది

ట్విట్టర్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌లు

మైక్రోబ్లాగింగ్‌ వేదిక ‘ట్విట్టర్‌’ డైరెక్ట్‌ మెసేజ్‌తోపాటు వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌కు భారత్‌లో శ్రీకారం చుడుతోంది. మన దేశం సహా జపాన్‌, బ్రెజిల్‌లో దశలవారీగా ఈ సదుపాయాన్ని ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. దీని ప్రకారం వాయిస్‌ నోట్‌లను డైరెక్ట్‌ మెసేజ్‌లుగా పంపొచ్చు. ప్రతి మెసేజ్‌ 140 సెకండ్లకు మించకూడదు. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌పై దీన్ని పొందవచ్చు. భారత మార్కెట్‌ తమకు చాలా ముఖ్యమని, ఆ కారణంగానే కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూ ఉంటామని ట్విట్టర్‌ ఇండియా ఎండీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆడియో మెసేజింగ్‌ను గతంలోనే ట్వట్టర్‌ విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లోనే ప్రపంచవ్యాప్తంగా వాయిస్‌ ట్వీట్‌లకు అవకాశం కల్పించింది. డైరెక్ట్‌ మెసేజ్‌లపై వాయిస్‌ మెసేజింగ్‌ కూడా ఆ మాదిరిగానే ఉంటుంది. టెలిగ్రామ్‌ తదితర యాప్‌లు కూడా ప్రైవేటు సంభాషణలకు సంబంధించి వాయిస్‌ మెసేజ్‌లను పంపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ట్విట్టర్‌లో దీన్ని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ఉన్న కన్వర్సేషన్‌ లేదంటే న్యూచాట్‌ని స్టార్ట్‌ చేయాలి. వాయిస్‌ టాప్‌ చేసి రికార్డింగ్‌ బటన్‌ నొక్కాలి. ఐఔస్‌ వినియోగదారులు మెసేజ్‌ను రికార్డు చేసేందుకు ఎంఐసి బటన్‌ను ప్రెస్‌ చేసి హోల్డ్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు  వాయిస్‌ మొదలు నుంచి పూర్తి చేసేవరకు  సెపరేట్‌గా టాప్‌ చేయాల్సి ఉంటుంది. 

Read more