కాపాడమంటూ సుబ్రహ్మణ్యం భార్య వాయిస్ మెసేజ్

ABN , First Publish Date - 2022-05-22T00:58:55+05:30 IST

ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులను జీజీహెచ్‌ మార్చురీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాపాడమంటూ సుబ్రహ్మణ్యం భార్య వాయిస్ మెసేజ్

కాకినాడ: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం (Post mortem) నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు అనుమతి నిరాకరించారు. రెండు రోజులుగా వైద్యులు, అధికారులు ప్రయత్నించినా సుబ్రహ్మణ్యం (Subrahmanyam) కుటుంబం సంతకాలు పెట్టడంలేదు. ఉదయ భాస్కర్‎ (Uday Bhaskar)ను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. తమను మహిళా పోలీసులు అరచేతిపై కొడుతున్నారంటూ.. సుబ్రహ్మణ్యం భార్య అనిత వాయిస్ మెసేజ్ పెట్టారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు సంతకం పెట్టాలని తమను కొడుతున్నారంటూ ఆమె వాపోయారు. తమను కాపాడాలంటూ అనిత వేడుకున్నారు.



వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) తన మాజీ డ్రైవర్‌ మృతదేహాన్ని సొంత కారులో తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్న డ్రైవర్‌ మృతదేహాన్ని మృతుడి ఇంటి వద్ద ఉదయభాస్కర్‌ దించడం, ఆ తర్వాత తన సొంత కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడం, శుక్రవారం అంతా అనంతబాబు అజ్ఞాతంలో ఉండడం కలకలం రేపుతోంది. మృతివెనుక ఎమ్మెల్సీ పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపణలు చేయడంతో వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రోడ్డు ప్రమాదమా? హత్య? అనేది సస్పెన్స్‌గా మారింది. 

Updated Date - 2022-05-22T00:58:55+05:30 IST