వాయిస్‌ కమాండ్స్‌తో కారు నడిపేయవచ్చు!

ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST

గూగుల్‌ డిజిటల్‌ కారు డ్రైవింగ్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. లాక్‌, అన్‌లాక్‌ అలాగే బీఎండబ్ల్యు వాహనాలను స్టార్ట్‌ చేయడం వరకు అన్నింటినీ ఈ ఫీచర్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌తోనే కానిచ్చేవచ్చు. ..

వాయిస్‌ కమాండ్స్‌తో  కారు నడిపేయవచ్చు!

గూగుల్‌ డిజిటల్‌ కారు డ్రైవింగ్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. లాక్‌, అన్‌లాక్‌ అలాగే బీఎండబ్ల్యు వాహనాలను స్టార్ట్‌ చేయడం వరకు అన్నింటినీ ఈ ఫీచర్‌ ఉన్న  స్మార్ట్‌ ఫోన్‌తోనే కానిచ్చేవచ్చు. గూగుల్‌ పిక్సల్‌ 6సిరీస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లలో ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్‌ తన బ్లాగ్‌లో ఈ విషయాలన్నింటినీ పొందుపరిచింది. గూగుల్‌ ప్లే బిల్ట్‌ఇన్‌ సహకారంతో ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాటిలో నేవిగేషన్‌ యాప్స్‌ సినర్జిక్‌, ఫిట్‌మెయిస్టర్‌; చార్జింగ్‌ కోసం చార్జింగ్‌ పాయింట్‌, ప్లగ్‌షేర్స్‌; పార్కింగ్‌ కోసం స్పాట్‌హీరో, పార్క్‌విజ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ ఏడాది చివర్లో యూట్యూబ్‌ సహాయంతో కారును పార్కింగ్‌ చేసిన స్థలంలో మ్యూజిక్‌ యాక్సెస్‌ పొందవచ్చు.


కార్ల  ఉత్పత్తిదారులు పోల్‌స్టర్స్‌, వోల్వో, జనరల్‌ మోటార్స్‌ ఇప్పటికే ఎంపిక చేసిన కార్లకు గూగుల్‌ టెక్నాలజీని జోడించి మరీ మార్కెట్‌కు పంపుతున్నాయి. గూగుల్‌ సైతం చెబుతున్న వాటికి మించి సదుపాయాలు కల్పించే యత్నంలో ఉంది. ‘ఐరన్‌ హార్ట్‌’ అనే కోడ్‌ నేమ్‌తో ఈ సాంకేతికతను గూగుల్‌ అభివృద్ధిపరుస్తున్నట్టు సమాచారం. అదే నిజమైతే ఈ సాంకేతికత మున్ముందు టెంపరేచర్‌ - హ్యుమిడిటీ రీడింగ్స్‌, స్పీకర్స్‌, ఈక్విలైజర్స్‌, ట్వీటర్స్‌, ఏరోమీటర్స్‌, స్పీడ్‌ మీటర్‌, టెకో మీటర్‌, సీట్లను కూడా అడ్జస్ట్‌ చేయగలదు

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST