ఫేస్‌బుక్‌ నుంచి వాయిస్‌, వీడియో కాల్స్‌

ABN , First Publish Date - 2021-08-28T05:54:05+05:30 IST

మెసెంజర్‌ తెరవకుండానే, మెయిన్‌ యాప్‌ నుంచి నేరుగా వాయిస్‌, వీడియో కాల్స్‌ను చేసుకునే సౌకర్యాన్ని ఫేస్‌బుక్‌ కొంతమంది వినియోగదారులకు కలుగజేస్తోంది.

ఫేస్‌బుక్‌ నుంచి వాయిస్‌, వీడియో కాల్స్‌

మెసెంజర్‌ తెరవకుండానే, మెయిన్‌ యాప్‌ నుంచి నేరుగా వాయిస్‌,  వీడియో కాల్స్‌ను చేసుకునే సౌకర్యాన్ని ఫేస్‌బుక్‌ కొంతమంది వినియోగదారులకు కలుగజేస్తోంది. మెయిన్‌ యాప్‌తో కలిసి ఉన్న మెసెంజర్‌ను చాలాకాలం క్రితమే ఫేస్‌బుక్‌ విడదీసింది. ఫలితంగా మెసెంజర్‌ యాప్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటే తప్ప అది అందుబాటులోకి రాదు. 

ఫేస్‌బుక్‌ తన యాప్‌లన్నింటిలో మెస్సేజింగ్‌ను కలిపే యత్నంలో భాగంగా గత సెప్టెంబరులో మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసంధానం చేసింది. ఆ రెంటినీ డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే మెస్సేజింగ్‌ వంటి కార్యకలాపాలు వినియోగదారులు చేసుకోవచ్చు. మొత్తానికి వాట్సాప్‌ను ఇంటిగ్రేటెడ్‌ మిక్స్‌గా మారుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో మెసేజింగ్‌, ఆడియో - వీడియో కాల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం మెసెంజర్‌ను ప్రజలు కొనసాగించాల్సి ఉంటుందని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంలో వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-28T05:54:05+05:30 IST