Vodafone Idea: మీరు వొడాఫోన్ ఐడియా వినియోగదారులా?.. అయితే ఇది మీకోసమే!

ABN , First Publish Date - 2022-10-05T02:59:35+05:30 IST

మీరు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea-Vi) వినియోగదారులా? అయితే, ఇది కచ్చితంగా మీకు సంతోషం కలిగించే

Vodafone Idea: మీరు వొడాఫోన్ ఐడియా వినియోగదారులా?.. అయితే ఇది మీకోసమే!

న్యూఢిల్లీ: మీరు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea-Vi) వినియోగదారులా? అయితే, ఇది కచ్చితంగా మీకు సంతోషం కలిగించే వార్తే అవుతుంది. ‘వీఐ’ ప్రత్యర్థులైన జియో, ఎయర్‌టెల్ సంస్థలు ఇప్పటికే 5జీ(5G)లోకి ప్రవేశించాయి. దీంతో వొడాఫోన్ ఐడియా(Vodafone Idea-Vi) కూడా 5జీలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే తాము 5జీ ప్రయాణాన్ని ప్రారంభిస్తామని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ 2022)లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ‘వీఐ’(Vodafone Idea-Vi) దాని నుంచి ఎలా బయటపడుతుందన్న ప్రశ్నకు ఇటీవలే సీఈవోగా నియమితులైన అక్షయ మూండ్రా మాట్లాడుతూ.. నిధుల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నట్టు తెలిపారు.  


జియో వచ్చిన తర్వాత టెలికం రంగంలో భారీ కుదుపు ఏర్పడింది. దాని దెబ్బకు ప్రత్యర్థి టెలికం సంస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. వినియోగదారులకు జియో అందించిన ఆఫర్లు తదితర వాటిని తట్టుకోలేకపోయాయి. ఖాతాదారులను కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయాయి. అయితే, ఆ తర్వాత కనాకష్టంగా ఎయిర్‌టెల్ పుంజుకున్నప్పటికీ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea-Vi) మాత్రం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. నష్టాల ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నానా అవస్థలు పడుతోంది. ప్రస్తుతం ప్రైవేటు టెలికం రంగంలో నష్టాలతో కునారిల్లుతున్న ఒకే ఒక్క సంస్థ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea-Vi). వీఐ కష్టాలకు బకాయిలు పేరుకుపోవడమే అసలు కారణం. ఆదాయం లేకుండానే అది నెట్టుకొస్తోంది. కాబట్టి నిధులు లభిస్తే తప్ప ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. 


వొడాఫోన్ ఐడియా(Vodafone Idea-Vi) కూడా 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంది. దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కూడా కలిగి ఉంది. కాబట్టి దాని 17 సర్కిళ్లలో 5జీని అమలు చేయాలని చూస్తోంది. వీఐకి(Vodafone Idea-Vi) ఎంఎం వేవ్, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ రెండూ అందుబాటులో ఉన్నాయి. వీఐ(Vodafone Idea-Vi) 5జీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటే కనుక 5జీ ఎన్ఎస్ఏ (non-standalone) నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తుంది. అంటే దీనిని బట్టి వొడాఫోన్ ఐడియా (Vodafone Idea-Vi) వినియోగదారులు 5జీ సర్వీసులను తమ 4జీ సిమ్ కార్డులపైనే పొందగలుగుతారని అర్థం. అయితే, ఇప్పటికిప్పుడు 5జీ సేవలు అందించే వెసులుబాటు లేకపోవడంతో దాని వినియోగదారులు పక్క చూపులు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే వీఐ(Vodafone Idea-Vi) తమ వినియోగదారులను కోల్పోయే అవకాశం ఉంది.   

Updated Date - 2022-10-05T02:59:35+05:30 IST