లేదు.. అలాంటి ప్రతిపాదనేమీ లేదు: వొడాఫోన్ ఐడియా

ABN , First Publish Date - 2020-05-30T03:21:43+05:30 IST

ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెట్టనున్నట్టు వస్తున్న

లేదు.. అలాంటి ప్రతిపాదనేమీ లేదు: వొడాఫోన్ ఐడియా

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెట్టనున్నట్టు వస్తున్న వార్తలను వొడాఫోన్ ఐడియా ఖండించింది. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొన్నట్టు అటువంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ)లకు రాసిన లేఖలో పేర్కొంది. ‘‘మీడియాలో పేర్కొన్నట్టు అటువంటి ప్రతిపాదనేదీ లేదు’’ అని పేర్కొంది. అత్యధికమంది ఖాతాదారులతో దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అయినప్పటికీ వొడాఫోన్ ఐడియా కష్టాలు ఎదుర్కొంటోంది. మరోవైపు, రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌బుక్, అమెరికా ప్రైవేటు ఈక్విటీ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడుల ద్వారా జియో నెల రోజుల్లోనే ఏకంగా 10 బిలియన్ డాలర్లు సమీకరించింది.

Updated Date - 2020-05-30T03:21:43+05:30 IST