Abn logo
Jul 30 2020 @ 18:20PM

84 రోజుల కాలపరిమితితో సరికొత్త రీచార్జ్ ప్యాక్‌ను ప్రకటించిన వొడాఫోన్ ఐడియా

న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటాతో రూ. 819 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అయితే, ఈ ప్లాన్ ఢిల్లీ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర సర్కిళ్లలో ఎప్పుడు ప్రవేశపెట్టేదీ వెల్లడించలేదు. ఈ ప్లాన్‌లో వొడాఫోన్ ప్లే, జీ5 సేవలు కూడా లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌లోనూ ఇటువంటి ప్రయోజనాలే ఉన్నాయి. అయితే, డబుల్ డేటా ఆఫర్‌లో భాగంగా ఇందులో 4జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.  

Advertisement
Advertisement
Advertisement