జీతం అడిగితే ఉద్యోగం మానుకోమంటున్నారు

ABN , First Publish Date - 2022-05-24T04:20:47+05:30 IST

తనకు ఏడాది నుంచి నెలకు రూ.8వేలు వంతున రూ.96వేలు వేతనం రావాల్సి ఉందని, అది చెల్లించమని అడిగితే ఉద్యోగం మానుకుంటే జీతం ఇస్తానని గట్టుపలి వెలుగు సీసీ శ్రీలత అంటున్నారని వీవోఏ నలమోతు తనూజ ఆవేదన వ్యక్తం చేసింది.

జీతం అడిగితే ఉద్యోగం మానుకోమంటున్నారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వీవోఏ తనూజ

వీవోఏ తనూజ ఆవేదన

జలదంకి, మే 23: తనకు ఏడాది నుంచి నెలకు రూ.8వేలు వంతున రూ.96వేలు వేతనం రావాల్సి ఉందని, అది చెల్లించమని అడిగితే ఉద్యోగం మానుకుంటే జీతం ఇస్తానని గట్టుపలి వెలుగు సీసీ శ్రీలత అంటున్నారని వీవోఏ నలమోతు తనూజ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ గతంలో పనిచేసిన సీసీ తిరుమల స్త్రీనిధి పెండింగ్‌ బకాయిలు పూర్తిగా వసూలు చేసినప్పటికీ మళ్లీ బకాయిలు ఉన్నాయని, అవి క్ల్లియర్‌ చేయాలని ఒకసారి, ఉద్యోగం మానుకుంటే జీతం ఇస్తానని మరోసారి ఇబ్బంది పెడుతుందని చెప్పారు. ఈ విషయంపై ఏపీఎంకు ఫిర్యాదు చేయగా ఆయన విచారించి జీతం ఇవ్వమని సీసీని ఆదేశించారన్నారు. అయినా జీతం ఇవ్వకుండా సీసీ ఇబ్బంది పెడుతోందని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తనూజ భర్త చెంచునాయుడు, వైసీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T04:20:47+05:30 IST