లంకలకోడేరు వీవోఏపై కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2022-05-22T05:56:58+05:30 IST

లంకలకోడేరు వీవోఏపై కొనసాగుతున్న విచారణ

లంకలకోడేరు వీవోఏపై కొనసాగుతున్న విచారణ
లంకలకోడేరు యూనియన్‌ బ్యాంక్‌లో విచారణ జరుపుతున్న అధికారులు

పాలకొల్లు రూరల్‌, మే 21: లంకలకోడేరు డ్వాక్రా సంఘాల వీవోఏ సీహెచ్‌ నాగదుర్గపై విచారణ కొన సాగుతోంది. డీఆర్డీయే పీడీ వేణుగోపాల్‌ ఆదేశాలతో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు శ్రీనివాసరావు, వెంక టేశ్వరరావు శివాలయం వద్ద శనివారం గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ విచారణ చేపట్టారు. గ్రామం లోని యూనియన్‌ బ్యాంక్‌లో రికార్డులు తనిఖీ చేశారు. సభ్యుల ఖాతాల నుంచి వీవోఏ నాగదుర్గ వ్యక్తిగత ఖాతాలకు సొమ్ములు బదిలీ అయినట్టుగా అధికారులు గుర్తించారు. సభ్యులకు తెలియకుండా కొంత సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నట్టు నిర్ధారిం చినట్టు అధికారులు తెలిపారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, బ్యాంక్‌ ఓచర్లు, తీర్మానాలు పరిశీలించాలని, సంతకాలు, తీర్మానాలు ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణ ఐతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అవకతవకలపై వీవోఏ నుంచి అంగీకార పత్రం తీసుకుంటామన్నారు. రూ.19,98,150 అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. రాధిక ఎస్‌హెచ్‌జీ గ్రూపునకు చెందిన రూ. 1,25,000లకు తనదే బాధ్యత అని వీవోఏ నాగదుర్గ అంగీకరిస్తూ రాసి సంతకం చేశారు.

Updated Date - 2022-05-22T05:56:58+05:30 IST