ఇళ్ల నుంచే తిలకించండి

ABN , First Publish Date - 2020-10-18T20:18:39+05:30 IST

ఇళ్ల నుంచే తిలకించండి..

ఇళ్ల నుంచే తిలకించండి

సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతి లేదు 

ఉత్సవాలు, పులి, విచిత్ర వేషాల నిషేధం

అమ్మవారి దర్శనానికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు 

మాస్క్‌లు ధరించిన వారికే అనుమతి  

కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ 


కలెక్టరేట్: విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ సిరిమానోత్సవాన్ని కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులు ఈ ఏడాది ఇళ్ల నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూడాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. ఆ రోజు సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉండదన్నారు. పైడితల్లమ్మ ఉత్సవాలపై కలెక్టరేట్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలతో ఉత్సవం నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సహకరించాలన్నారు. జిల్లా లో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతోందని, ఉత్సవంలో జన సమీకరణ జరిగి ఈ మహమ్మారి విజృంభించే ప్ర మాదం ఉందని చెప్పారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితిలో కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తొలేళ్ల నుంచి సిరిమానోత్సవం వరకూ వివిధ ఆచారాలు, ముఖ్య ఘట్టాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టెస్టులు చేస్తామని చెప్పారు. పులివేషాలు, ఇతర వేషధారణల నిషేధంతో పాటు విజయనగర ఉత్సవాలను ఈ ఏడాది నిర్వహించడం లేదన్నారు.


భౌతిక దూ రం పాటించే విధంగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాస్కులు ధరించిన వారినే అమ్మవారి దర్శనానికి అనుమ తిస్తామన్నారు. ఎస్‌పీ బి.రాజకుమారి మాట్లాడుతూ బయటి జిల్లాల నుంచి వచ్చేవారిని సరిహద్దు చెక్కు పోస్టుల వద్ద నిలిపివేస్తామన్నారు. భక్తులంతా ఇళ్ల నుంచి టీవీల ద్వారా లేదా నగరంలో ఏర్పాటు చేసే ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల వద్ద సిరిమానో త్సవాన్ని తిలకించాలని చెప్పారు. సిరిమాను ఊరేగింపు రోజున పట్టణంలో  పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తున్నామని  తెలిపారు.  ఉదయం 11 గంటల తరువాత ఆలయ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. అలాగే ప్రత్యేక పాస్‌లు ఉన్నవా రిని మాత్రమే ఉత్సవానికి అనుమతిస్తామన్నారు. ఎంఎల్‌ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల అభిప్రాయం మేరకు సిరిమానోత్స వంపై కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నామని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తొలేళ్లు, సిరిమానోత్సవ రోజుల్లో ఉచిత దర్శనం రద్దు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, జల్లేపల్లి వెంకటరావు, ఆర్‌డీవో భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-18T20:18:39+05:30 IST