విశాఖ RK Beachలో ఒక్కసారిగా ముందుకొచ్చిన సముద్రం..

ABN , First Publish Date - 2021-12-05T19:21:53+05:30 IST

వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ఒక్కసారిగా ముందుకొచ్చింది...

విశాఖ RK Beachలో ఒక్కసారిగా ముందుకొచ్చిన సముద్రం..

విశాఖపట్నం : వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ఒక్కసారిగా ముందుకొచ్చింది. సముద్రపు అలల తాకిడికి భూమి బీటలువారింది. దీంతో బీచ్‌ దగ్గర అర కిలోమీటర్‌కు పైగా భూమి కోతకు గురైంది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడివరకు భూమి కోతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చిల్డ్రన్‌పార్క్‌లోనూ పది అడుగుల మేర భూమి కుంగినది. ఇలా భూమి కుంగడంతో ప్రహారీగోడ కుప్పకూలింది. ఈ ఘటనతో పర్యాటకులు, స్థానికులు ఒక్కసారిగా అక్కడ్నుంచి పరుగులు తీశారు. చిల్డ్రన్‌పార్క్‌ వైపు రాకపోకలను జీవీఎంసీ అధికారులు, పోలీసులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకుల అనుమతించమని పోలీసులు తెలిపారు. మరోవైపు.. సందర్శకులు ఎవరూ పార్క్ దగ్గరికి రాకుండా నోవాటెల్ హాటల్ ముందు భాగంలో పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా.. జవాద్ తుఫాను కారణంగా ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు.


ఇదిలా ఉంటే.. ‘జవాద్‌’ తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారడంతో జిల్లాకు ముప్పు తప్పింది. అయితే.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో గాలులు వీస్తాయని.. అంతకు మించి పెద్దగా ప్రమాదం లేదని వాతావరణ నిపుణులు చెప్పారు. దీంతో జిల్లాలో రైతులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇవాళ ఆర్కే బీచ్ దగ్గర జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడుతున్నారు. 



Updated Date - 2021-12-05T19:21:53+05:30 IST