భిక్కనూరు సమాఖ్యలో వీవోల ఆడిట్‌

ABN , First Publish Date - 2021-04-16T06:20:22+05:30 IST

భిక్కనూరు మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం మండలంలోని అన్నిగ్రామాల వీవోల ఎక్స్‌టర్నల్‌ ఆడిట్‌ నిర్వహించారు.

భిక్కనూరు సమాఖ్యలో వీవోల ఆడిట్‌

భిక్కనూరు, ఏప్రిల్‌ 15: భిక్కనూరు మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం మండలంలోని అన్నిగ్రామాల వీవోల ఎక్స్‌టర్నల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఈ మేరకు వీవోల వసూళ్లు, చెల్లింపులు, ఆదాయం, వ్యయాల పుస్తకాలు, చెక్కు బుక్కులు, రసీదు పుస్తకాలు, ఓచర్స్‌ తదితర వాటిని ఆడిటర్‌లు రమేష్‌, వేణు పర్యవేక్షించారు. జిల్లాలోనే మొదటిసారిగా భిక్కనూరు వీవోల ఆడిట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్‌, సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీలు, వీవోఏలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:20:22+05:30 IST