కరోనా వ్యాపి చెందకుండా చర్యలు

ABN , First Publish Date - 2020-04-04T11:10:42+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ప్రత్యేకాధికారి వివేక్‌యాదవ్‌ తెలిపారు.

కరోనా వ్యాపి చెందకుండా చర్యలు

ప్రత్యేకాధికారి వివేక్‌యాదవ్‌ 


విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌ 3 : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ప్రత్యేకాధికారి వివేక్‌యాదవ్‌ తెలిపారు. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి కరోనా నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ  సందర్భంగా జిల్లాలో వైద్యాధికారుల సేవలను, కరోనా ఆసుపత్రుల్లో ఏర్పాట్లను వివేక్‌యాద్‌వ్‌ తెలిపారు.  నెల్లిమర్లలోని మిమ్స్‌ ఆసుపత్రిని జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిగా ఏర్పాటు చేశామని... ఐసీయూతో వేయి పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.  కరోనా రోగులకు సత్వరమే వైద్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు  గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు, డ్రెస్‌ల  కొరత ఉందని , వెంటనే వాటిని సరఫరా చేయాలని కోరారు.  మాక్‌ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జేసీ-2 ఆర్‌.కూర్మనాఽథ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమణకుమారి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:10:42+05:30 IST