విధి నిర్వాహణలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి : వివేక్ రామ్ చౌదరి

ABN , First Publish Date - 2021-12-18T16:09:06+05:30 IST

దుండిగల్ ఎయిర్ పోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు.

విధి నిర్వాహణలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి : వివేక్ రామ్ చౌదరి

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ పోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి తొలి గౌరవ వందనాన్ని వివేక్ రామ్ చౌదరి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘శిక్షణ పూర్తి చేసుకొని అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్న మీ అందరికీ అభినందనలు. శిక్షణ కాలంలో ఎలాంటి స్ఫూర్తిని చూపించారో భవిష్యత్తులోనూ కొనసాగించాలి. నిరంతర విద్యార్థిగా ఉంటేనే ఎంతో నేర్చుకోగలం. విధి నిర్వాహణలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కోవాలి. పెరుగుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భవిష్యత్తు మీరే. పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, మిలిటరీ సిస్టమ్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రొఫెషనలిజం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండండి. కష్ట సమయాల్లోనూ ముందుకు వెళ్లే సామర్ధ్యం పెంచుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T16:09:06+05:30 IST