Abn logo
Jun 25 2021 @ 14:53PM

వివేకా హత్య కేసులో మాజీ ఎంపీపీని ప్రశ్నిస్తున్న సీబీఐ

కడప: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేకా హత్య కేసు చేధించేందుకు సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా 19వ రోజు శుక్రవారం విచారణను సీబీఐ బృందం వేగవంతం చేసింది. విచారణలో భాగంగా మాజీ ఎంపీపీ సుధాకర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సుధాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.


మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. రెండు వారాల నుంచి జిల్లాకు చెందిన పలువురు అనుమానితులతో పాటు వైఎస్‌ వివేకాతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారిని కూడా కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం పులివెందుల ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న బాలు అనే వ్యక్తిని విచారించారు. కాగా, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్‌ సునీతలతో సీబీఐ అధికారులు గురువారం వారి నివాసంలో మూడు గంటల పాటు సమావేశమయ్యారు.