జిల్లా అటవీ శాఖాధికారిగా వివేక్‌

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

అన్నమయ్య జిల్లా అటవీ శాఖాధికారిగా తమిళనాడుకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి వివేక్‌ గురువారం రాజంపేట డివిజన్‌ ఫారెస్ట్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

జిల్లా అటవీ శాఖాధికారిగా వివేక్‌
బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతున్న డీఎఫ్‌వో వివేక్‌

రాజంపేట, సెప్టెంబరు 28 : అన్నమయ్య జిల్లా అటవీ శాఖాధికారిగా తమిళనాడుకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి వివేక్‌ గురువారం రాజంపేట డివిజన్‌ ఫారెస్ట్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన లో భాగంగా జిల్లా అధికారిగా తనను నియమించారన్నారు. రాజంపేట డివిజన్‌ ప్రాంతంలో విస్తారమైన అటవీ ప్రాంతం, ఎర్రచందనం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని.. వాటి సంరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళ కూలీలు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారన్నారు. తమిళ కూలీల పాత్ర తగ్గించడానికి అదే చెన్నై ప్రాంతానికి చెందిన తనను జిల్లా అటవీశాఖాధికారిగా నియమించారన్నారు. తమిళ స్మగ్లర్ల ఆటలు కట్టించడానికి, ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. 

 

Updated Date - 2022-09-28T05:30:00+05:30 IST