మంచినూనెలో ఏ, డీ విటమిన్లు..!

ABN , First Publish Date - 2020-09-27T08:27:43+05:30 IST

భారతీయుల్లో ఉన్న విటమిన్‌ లోపాన్ని తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎస్‌ఏఐ) నిర్ణయించింది...

మంచినూనెలో ఏ, డీ విటమిన్లు..!

  • తప్పనిసరి చేయనున్న ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ
  • రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: భారతీయుల్లో ఉన్న విటమిన్‌ లోపాన్ని తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎస్‌ఏఐ) నిర్ణయించింది. ఉత్పత్తిదారులంతా మంచినూనెలో ఏ, డీ విటమిన్లను కలపడాన్ని తప్పనిసరి చేయనుంది. ఈ విషయాన్ని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ సీఈవో అరుణ్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ, గ్లోబల్‌ అలెయన్స్‌ ఫర్‌ ఇంప్రూవ్డ్‌ న్యూట్రిషియన్‌ (గెయిన్‌), ఫుడ్‌ ఫోర్టిఫికేషన్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎ్‌ఫఆర్‌సీ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో మాల్‌న్యూట్రిషియన్‌ లోపం.. ఏ, డీ విటమిన్ల లోపంతో అనారోగ్యం, మరణాలు, పునరుత్పత్తి శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇది ఆర్థిక స్వావలంబనకు ఆటంకంగా ఉంది. ప్రతి ఒక్కరూ మంచినూనెను వినియోగిస్తారు. అందులోనే ఏ, డీ విటమిన్లు ఉండేలా చూస్తే.. ఈ సమస్యలు దూరమవుతాయి.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-09-27T08:27:43+05:30 IST