Advertisement
Advertisement
Abn logo
Advertisement

విటమిన్ల కొరత ఉంటే ఇన్ని సమస్యలా..

ఆంధ్రజ్యోతి(07-07-2020)

విటమిన్లు, పోషకాల లోపం పలు లక్షణాల ద్వారా బయల్పడుతుంది. ఆ లక్షణాల ఆధారంగా అసలు లోపాన్ని ఇలా కనిపెట్టాలి! 


చుండ్రు: తరచుగా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటే, ఫ్యాటీ యాసిడ్ల లోపంగా భావించాలి. ఈ లోపాన్ని అధిగమించడం కోసం వారానికి కనీసం రెండు సార్లైనా ఆహారంలో చేపలు చేర్చుకోవాలి.


వెంట్రుకలు ఊడడం: వెంట్రుకలు బలహీనపడి, ఎక్కువగా ఊడిపోతూ ఉంటే బి-విటమిన్‌ లోపంగా భావించాలి. పాలకూర, బచ్చలికూరలను తింటే ఈ లోపం తగ్గుతుంది. 


పోషకాల లోపం: తీసుకునే పదార్థాల్లోని విటమిన్లు, ఇతర పోషకాలను శరీరం శోషించుకోలేకపోవడానికి కారణం పొట్టలోని  సరిపడా ఆమ్లం లోపించడమే! ఈ ఆమ్లాన్ని సమం చేయడం కోసం యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ ప్రతి రోజూ కొంత తీసుకోవాలి.


గాయాలు: తేలికగా చర్మం కందిపోయి, గాయాలపాలవుతూ ఉంటే విటమిన్‌-సి లోపంగా భావించాలి. పుల్లని పళ్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.


కండరాల నొప్పులు: చిన్న పనికే కండరాలు అలసిపోయి, నొప్పి పెడుతూ ఉంటే క్యాల్షియం, మెగ్నీషియం లోపంగా భావించాలి. అరటిపండు, అవకాడో తినడం ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు.


పేగుల సమస్యలు: అరుగుదల తగ్గడం, పేగులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతూ ఉంటే, పీచు, మెగ్నీషియం తగ్గిందని గ్రహించాలి. ఈ లోపం కోసం యాపిల్స్‌, బ్రొకోలి తినాలి.  

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...