కరోనా చికిత్సలో ఆ సప్లిమెంట్ల వల్ల ఉపయోగం నిల్: అధ్యయనం

ABN , First Publish Date - 2021-02-17T01:14:17+05:30 IST

కరోనా చికిత్సలో జింక్, విటమిన్-సి సప్లిమెంట్ల వినియోగంపై జరిగిన తాజా అధ్యయనంలో విస్తుపోయే

కరోనా చికిత్సలో ఆ సప్లిమెంట్ల వల్ల ఉపయోగం నిల్: అధ్యయనం

న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో జింక్, విటమిన్-సి సప్లిమెంట్ల వినియోగంపై జరిగిన తాజా అధ్యయనంలో విస్తుపోయే విషయం వెల్లడైంది. కొవిడ్ చికిత్సలో వీటిని వాడడం వల్ల లేశ మాత్రమైనా ఉపయోగం లేదని అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్ పరిశోధకులు తేల్చారు. యాంటీబాడీలు, తెల్లరక్తకణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించి, రోగనిరోధక పనితీరును పెంచడంలో కీలక పాత్ర పోషించే జింక్ కూడా కొవిడ్ కేసుల్లో ఏమంత ప్రభావం చూపించలేకపోయిందని పేర్కొన్నారు. అలాగే, కణాలు దెబ్బ తినడాన్నితగ్గించడంలో కీలకంగా వ్యవహరించే విటమిన్-సి కూడా కొవిడ్ రోగుల చికిత్సలో విఫలమైందని తెలిపారు. 


ఏప్రిల్ 2020-అక్టోబరు 2020 మధ్య 2014 మంది కొవిడ్ నిర్ధారిత రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ రోగులకు పది రోజులపాటు జింక్ గ్లుకోనేట్ (50ఎంజీ), విటమిన్ సి (8000 ఎంజీ) ఇచ్చారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘జామా ఓపెన్ నెట్‌వర్క్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. విటమిన్-సి, జింక్ ఇచ్చినా రోగుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.  

Updated Date - 2021-02-17T01:14:17+05:30 IST