చర్మానికి మంచి దోస్తీ

ABN , First Publish Date - 2021-06-26T08:54:47+05:30 IST

చర్మానికి సి- విటమిన్‌ అవసరం చాలా ఉంటుంది. చర్మ ఆరోగ్యమే కాకుండా సౌందర్యానికి ఇది చాలా అవసరం.

చర్మానికి మంచి దోస్తీ

చర్మానికి సి- విటమిన్‌ అవసరం చాలా ఉంటుంది. చర్మ ఆరోగ్యమే కాకుండా సౌందర్యానికి ఇది చాలా అవసరం. ఇంతకీ సి- విటమిన్‌ ఎందులో ఎక్కువ దొరుకుతుంది?

సి విటమిన్‌ ఉండే ఆహారపదార్థాలను సరైన మోతాదులో తీసుకుంటే సరి. నారింజ, నిమ్మ, బెర్రీస్‌, బ్రొకోలీ తింటే చర్మానికి మంచిది. సి-విటమిన్‌ను శరీరం ఉత్పత్తి చేయలేదు. ఖచ్చితంగా ఆహారం నుంచే తీసుకోవాలి.

సి విటమిన్‌ వల్ల ఇమ్యూనిటీ వస్తుంది. రక్తపోటు రాకుండా అదుపులో ఉంచుతుంది. గుండె వ్యాధుల సమస్య ఉండదు. 

సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాల వల్ల కణాలు పాడైపోకుండా ఉండటానికి విటమిన్‌-సి అవసరం ఉంటుంది. అలాగని సన్‌స్ర్కీన్‌లా పనిచేయదు. చర్మం మీద ఉండే నల్లమచ్చలు, పొడల్లాంటి హైపర్‌పిగ్మెంటేషన్‌ సమస్య రాకుండా సి విటమిన్‌ పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మం మెత్తగా, మెరుపువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

సాధారణంగా యాంటీ ఏజింగ్‌ క్రీమ్స్‌లో సి విటమిన్‌ ఓ పవర్‌ఫుల్‌ ఇంగ్రిడియంట్‌. ఊరికే క్రీములు ముఖానికి రుద్దుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా నాణ్యమైన డైట్‌ పాటించాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. సి విటమిన్‌ వల్ల కొల్లాజిన్‌ ఉత్పత్తి అయి చర్మానికి తగిలిన గాయాలు త్వరగా మానిపోతాయి. ఇక స్కిన్‌టోన్‌కు తిరుగు ఉండదు. సిట్రస్‌ ఉండే పండ్లు నిమ్మ, నారింజ, బెర్రీల్లోనే సి విటమిన్‌ ఉంటుంది. వీటితో పాటు కొత్తిమీర, రెడ్‌ పెప్పర్‌, బ్రొకోలీ లాంటి వాటిలో సి విటమిన్‌ అధికశాతం ఉంటుంది.

Updated Date - 2021-06-26T08:54:47+05:30 IST