ఏపీఆర్‌జేసీలో ‘విశ్వం’ విద్యార్థుల విజయకేతనం

ABN , First Publish Date - 2022-07-01T05:54:33+05:30 IST

ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ ఐదో తేదీన నిర్వహించిన ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

ఏపీఆర్‌జేసీలో ‘విశ్వం’ విద్యార్థుల విజయకేతనం
విద్యార్థులను అభినందిస్తున్న విశ్వనాథరెడ్డి

 - ఎంపీసీ ఒకేషనల్‌లో స్టేట్‌ ప్రథమ, ద్వితీయ ర్యాంకులు

తిరుపతి(విద్య), జూన్‌ 30: ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ ఐదో తేదీన నిర్వహించిన ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా (2020, 2021) ఈ పరీక్షను జరపకుండా లాటరీ పద్ధతిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. 2022లో ప్రవేశ పరీక్ష నిర్వహించి.. మార్కులు ఇవ్వకుండా ర్యాంకులను వెల్లడించారు. ఈ ఫలితాల్లో తిరుపతిలోని వరదరాజనగర్‌లో ఉన్న విశ్వంస్కూల్‌లో శిక్షణ తీసుకున్న పలువురు విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ (ఒకేషనల్‌) కోర్సుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులతోపాటు వివిధ విభాగాల్లో 10లోపు ఐదు ఉత్తమ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారని స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. తమ విద్యార్థులు సి.పర్ణిక (ఎంపీసీ, ఒకేషనల్‌ ఈఈటీ గ్రూపు) రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, డి.గోకుల్‌కృష్ణ (ఎంపీసీ, ఒకేషనల్‌ ఈఈటీ)లో ద్వితీయర్యాంకు, జి.పూజిత 7వ ర్యాంకు, బైపీసీలో (సీజీడీఎం గ్రూపు) బి.తేజోరామ్‌, జె.సుశాంత్‌ 8వ ర్యాంకులతోపాటు వి.లక్ష్మీప్రియ తదితరులు ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. విద్యార్థులను అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్‌ ఎన్‌.తులసి, ఎన్‌.విశ్వశ్రీ, టీచర్లతో కలిసి విశ్వనాథరెడ్డి అభినందించారు. 

Updated Date - 2022-07-01T05:54:33+05:30 IST