విస్తారా విమానంలో సాంకేతిక లోపం... ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , First Publish Date - 2022-02-17T17:48:46+05:30 IST

అమృత్‌సర్‌కు బయలుదేరిన విస్తారా విమానం గురువారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది...

విస్తారా విమానంలో సాంకేతిక లోపం... ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ: అమృత్‌సర్‌కు బయలుదేరిన విస్తారా విమానం గురువారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.146 మంది ప్రయాణికులతో అమృత్‌సర్‌కు బయలుదేరిన విస్తారా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.విస్తారా విమానం టేకాఫ్ అయిన వెంటనే, పైలట్ స్నాగ్‌ను గుర్తించారు. దీంతో పైలట్ వెంటనే ఢిల్లీ విమానాశ్రయ అధికారులను సంప్రదించాడు.గురువారం ఉదయం 10:15 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సంబంధించి తమకు కాల్ వచ్చిందని ఢిల్లీ విమానాశ్రయ  సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.


దేశీయ విమానాలకు వెళ్లే టెర్మినల్ నంబర్ 2లోని రన్‌వే నంబర్ 28 వద్ద అత్యవసర గంటను మోగించారు.దీంతో పోలీసు బృందాలు, అగ్నిమాపక దళం అధికారులు హుటాహుటిన విమానాశ్రయం రన్ వే వద్దకు తరలివచ్చారు.ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఆరు అగ్నిమాపక వాహనాలను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు.విస్తారా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఢిల్లీ విమానాశ్రయ అధికారి తెలిపారు.

^^^^^^^

Updated Date - 2022-02-17T17:48:46+05:30 IST