ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు నష్టం

ABN , First Publish Date - 2020-11-30T05:55:47+05:30 IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా నివర్‌ తుఫాన్‌ను అంచనా వేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు నష్టం
తిరుగుడుమెట్టలో తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రులు

మాజీ మంత్రి పీతల సుజాత

వర్షాలకు దెబ్బతిన్న పంట  పొలాలను 

పరిశీలించిన టీడీపీ మాజీ మంత్రులు

తాళ్లపూడి, నవంబరు 29: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా నివర్‌ తుఫాన్‌ను అంచనా వేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు  తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు.  ఆదివారం తిరుగుడుమెట్టలో దెబ్బతిన్న వరి పంటలు, రావూరుపాడులో పాడైన కూరగాయల తోటలను మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌,  ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు పరిశీలించి రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వంతో పోరాడతామని అన్నారు.   సుజాత మాట్లాడుతూ పూర్తిగా నేలకొరిగి మొక్క దశకు చేరుకున్న తరువాత అధికారులు తీరుబడిగా వచ్చి పంట నష్టాన్ని అంచనా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాదిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ  రైతులు  కష్టాల్లో ఉంటే  వారికి భరోసా కల్పించడం పోయి సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల తగువులను తీర్చడానికి సమయాన్ని కేటాయిస్తున్నారన్నారని అన్నారు.   మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ మండలంలో అంతా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని,  ఎకరాకు సుమారు రూ. 35 వేలు పెట్టుబడులు పెట్టారన్నారు. కనీసం బస్తా ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేస్తే   పంటల నష్టాలు తెలియవన్నారు. వెంటనే ఎకరాకు రూ. 35 వేల చొప్పున పరిహారం అందించాలని  డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తే ఊరుకోమని రిటర్న్‌గిఫ్ట్‌లు తప్పవని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై అధికారుల తీరు  గమనిస్తున్నామన్నారు.  


Updated Date - 2020-11-30T05:55:47+05:30 IST