పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ

ABN , First Publish Date - 2021-09-18T05:23:40+05:30 IST

పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శ్రీ విరాట్‌ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గుమ్మడిదల లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ
కందిలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సీనియర్‌ క్లబ్‌లో హోమం నిర్వహిస్తున్న విశ్వ బ్రాహ్మణ ఉద్యోగులు

విశ్వకర్మ జయంతిలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

గుమ్మడిదల/జిన్నారం/నారాయణఖేడ్‌/రాయికోడ్‌/కంది, సెప్టెంబరు 17: పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శ్రీ విరాట్‌ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గుమ్మడిదల లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. జిన్నారం, ఊట్ల, బొల్లారం, కాజీపల్లిలో విశ్మకర్మ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భగవాన్‌ విశ్మకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణఖేడ్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. కాళికా మాత ఆలయంలోను విశ్వకర్మ జయంతిని నిర్వహించడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాయికోడ్‌లోని పాండురంగ మందిరంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు ప్రభాకర్‌ చారి, విశ్వస్పృతికర్త విశ్వకర్మ భగవానుడి మండల విశ్వకర్మ సోదరులతో కలిసి పూజా కార్యక్రమాలు, జెండాను ఆవిష్కరించారు. ఓబీసీ సంఘం అధ్యక్షుడు తాటిపల్లి పాండు ఆధ్వర్యంలో కందిలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలోని సీనియర్‌ క్లబ్‌లో విశ్వ బ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు విశ్వకర్మ మహారాజ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హోమం నిర్వహించి అన్న ప్రసాద వితరణ చేశారు. 

మెదక్‌లో

తూప్రాన్‌/పెద్దశంకరంపేట/పాపన్నపేట/హవేళీఘణపూర్‌/అల్లాదుర్గం/ రేగోడు/నర్సాపూర్‌/చేగుంట, సెప్టెంబరు 17: తూప్రాన్‌లోని వీరబ్రహేంద్రస్వామి ఆలయంలో శుక్రవారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు సరాఫ్‌ సతీ్‌షచారీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దశంకరంపేట రామాలయంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై విశ్వకర్మ భగవానుడు చిత్రపటాన్ని ఉంచి రామాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా జై విశ్వకర్మ జైజై విశ్వకర్మ అంటూ ర్యాలీ నిర్వహించారు.  మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు, మిన్‌పూర్‌ ఎంపీటీసీ వడ్ల కుబేరుడు ఆధ్వర్యంలో పాపన్నపేటలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం యజ్ఞయాగాదులు, పూజలు నిర్వహించారు. హవేళీఘణపూర్‌లో అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌ ఆలయంలో విశ్వకర్మకు ప్రత్యేక పేజలను నిర్వహించారు.  మండల సంఘం అధ్యక్షుడు చిన్న బ్రహ్మయ్య ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని రేగోడు బ్రహ్మంగారి మఠంలో ఘనంగా జరిపారు. నర్సాపూర్‌ మండలంలోని పెద్దచింతకుంట సమీపంలోని ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురలీధర్‌యాదవ్‌ పాల్గొన్నారు.  చేగుంట, నార్సింగి మండలాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వకర్మలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ జిల్లా విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ మత్రుసంగ అధ్యక్షుడు కమ్మరి వెంకటేశం చారి, రామచంద్రం చారి, శ్రీనివాస్‌, వెంకట్‌, మహేష్‌, రమేశ్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-18T05:23:40+05:30 IST